యవ్వనంగా కనిపించాలంటే...?


Thu,January 11, 2018 10:48 PM


* గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
* రెండు చెంచాల ఓట్‌మీల్‌లో గుడ్డు తెల్లసొన కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 10నిమిషాల తర్వాత తడిబట్టతో తుడువాలి. ఇలా వారంలో ఒకసారి చేయాలి.
* అరస్పూన్ మొక్కజొన్న పిండి, టీ స్పూన్ రోజ్‌వాటర్, గుడ్డు తెల్లసొన బాగా కలుపాలి. ముఖానికి, మెడకు రాసుకొని 10 నిమిషాల తర్వాత కడిగితే ముఖం మృదువుగా మారుతుంది.
* గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల తేనెను కలుపాలి. తర్వాత ముఖానికి పెట్టుకొని 15 నిమిషాల తర్వాత కడుగాలి. ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది.
* గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల బియ్యం పిండిని బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకొని 15 నిమిషాల తర్వాత కడుగాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే.. మీరు యవ్వనంగా కనిపిస్తారు.

5153

More News

VIRAL NEWS