అల్లం టీ ఎలా తయారు చేయాలో, దాని వల్ల కలిగే అద్భుత లాభాలు ఏమిటో తెలుసా..?


Mon,March 12, 2018 02:35 PM

వేడి, వేడిగా ఘాటుగా ఉండే అల్లం టీని చాలా మంది ఇష్టపడతారు. దీంతో దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు చక్కని ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే అల్లం టీని చాలా మందికి ఎలా తయారు చేయాలో తెలియదు. ఈ క్రమంలోనే ఆ టీ తయారీ విధానం, దాంతో కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు...


సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 టీస్పూన్
టీ పొడి - 1 టీస్పూన్ (ఒక కప్పుకు)
నీళ్లు - 3 కప్పులు
తేనె - 1 టీస్పూన్
నిమ్మ రసం - 1 టీస్పూన్
పాలు - అర కప్పు (మీ ఇష్టం)

తయారీ విధానం...


పాత్రలో 3 కప్పుల నీటిని తీసుకోవాలి. అందులో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో టీ పొడి, పాలు, తేనె వేయాలి. సిమ్మర్‌లో స్టవ్‌ను ఉంచి 3-4 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత నిమ్మరసం కలపాలి. అంతే.. అల్లం టీ తయారైనట్టే. దీన్ని తాగితే కింద చెప్పిన విధంగా మనకు లాభాలు కలుగుతాయి.

అల్లం టీ తాగడం వల్ల కలిగే లాభాలు...


1. అల్లంలో ఉండే జింజెరాల్ దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి అనారోగ్యాలను తక్షణమే తగ్గిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. రోగాలు వృద్ధి చెందకుండా చూస్తుంది.

2. ఉదయాన్నే కలిగే నీరసం, అలసట పోతాయి. వికారం తగ్గుతుంది.

3. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది.

4. కడుపునొప్పి, కడుపులో అసౌకర్యం తొలగిపోతాయి.

5. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

7087

More News

VIRAL NEWS

Featured Articles