మామిడి టెంకతో ఉపయోగాలెన్నో తెలుసా..?


Wed,May 16, 2018 07:51 PM


వేసవి వచ్చిందంటే ఎండలే కాదు..మామిడి కూడా గుర్తుకు వస్తుంది. పుల్లగా, తియ్యగా నోరూరించే మామిడి కోసం అందరూ ఎదురుచూస్తారు. చాలామంది మామిడి కాయ, పండు తినేసి టెంక పారేస్తారు. కానీ టెంక వల్ల చాలా ఉపయోగాలున్నాయి తెలుసా!
* మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
* ఉదర సంబంధ వ్యాధులకు మామిడిటెంక మంచి ఔషధం.
* మామిడిటెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మామిడి టెంకలోని గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్యలు తగ్గుతాయి.
* మామిడిటెంకలోని జీడిని పొడి చేసి దాన్ని మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
* మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి.
* తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
* మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి ఐప్లె చేస్తే చర్మం మెరిసిపోతుంది.

2534

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles