అరటితో గుండెపోటుకు చెక్!

Wed,April 19, 2017 07:05 AM

రోజుకు మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధనా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా ఈ విషయం వెల్లడయింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండు తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం వరకు నివారించిందని పరిశోధకులు తెలుసుకున్నారు. కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారిగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి జబ్బులు చాలామటుకు తగ్గిపోతాయని చెబుతున్నారు వారు.

1644

More News

మరిన్ని వార్తలు...