హెల్దీ ఆహారం..పక్కా డైట్ ప్లాన్ తో హోండెలివరీ


Fri,July 14, 2017 07:35 AM


హైదరాబాద్ : ఏది పట్టుకున్నా కల్తీ కాబోలనే సందేహం కలుగుతుందా? బయట ఆహారం తినాలంటే భయమేస్తోందా? అవును మరి... అంతగా కల్తీ ప్రభావం ఉంది. ఇలాంటి కల్తీ ప్రపంచంలో హెల్తీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. మనమే సొంతంగా తయారు చేసుకునేంత సమయం... తీరికా ఉండదు కూడా. ఇక మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే... నిర్థిష్టమైన డైట్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం పక్కాగా డైట్ ప్లాన్ చేసి, హెల్తీ ఫుడ్ అందిస్తోంది ఫిట్‌మీల్స్.

ఉరుకులు పరుగుల నగరజీవితంలో వంట చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. పోనీ బయట తిందామా అంటే... అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. తప్పదు కనుక ఓ హోటల్ ఫుడ్‌నో, పిజ్జా హౌజ్‌నో ఆశ్రయిస్తే... ఒబెసిటీ, థైరాయిడ్, డయాబెటీస్ ఇలా ఏవేవో వచ్చి చేరుతాయి. ఇకవాటి నుంచి తప్పించుకునేందుకు నానా అవస్థలూ పడాలి. ఒక్క వ్యాయామమే సరిపోదు కదా... ఫిట్‌గా ఉండాలంటే.. మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీకోసం అలాంటి హెల్తీ ఆహారాన్ని అందిస్తోంది ఫిట్‌మీల్స్ స్టార్టప్. న్యూట్రిషన్ సలహాకు తగ్గట్టు ఫుడ్‌ని ప్రొవైడ్ చేస్తుంది.

డైట్ ప్లాన్
మీ శరీరానికి తగ్గట్టు ఎలాంటి ఆహారం తీసుకోవాలో న్యూట్రిషన్ నుంచి సలహా తీసుకుంటే చాలు. లేదా.. మీకు అవసరమైన న్యూట్రిషన్‌ను సైతం ఫిట్‌మీల్ అరేంజ్ చేస్తుంది. బరువు తగ్గడానికి, లేదా బరువు పెరగడానికి, మజిల్ గెయిన్, వెయిట్ మెయింటెనెన్స్ కోసం, డయాబెటిక్ పేషెంట్ల వేర్వేరు డైట్ ప్లాన్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి కస్టమైజ్డ్ డైట్‌ని కూడా అందిస్తారు. ఈ ఫుడ్‌ని సరసరమైన ధరకే అందిస్తుండడం గమనార్హం.

హోం డెలివరీ
ఇంజినీరింగ్ చేసిన ఇద్దరు మిత్రులు ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. ముందుగా సరైన డైట్ ప్లాన్ కోసం వైద్యులను, నూట్రిషన్లను సంప్రదించారు. తాము పెట్టబోయే స్టార్టప్ గురించి చర్చించి వాళ్ల సలహాలతో డైట్ ప్లాన్స్ డిజైన్ చేశారు. అలా రెండేళ్ల క్రితం ప్రారంభిచిన స్టార్టప్ అనతికాలంలో నగరవాసుల నుంచి మంచి ఆదరణ పొందింది. వినియోగదారులు కోరుకున్న విధంగా మీల్ బాక్స్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వడం ఫిట్‌మీల్ ప్రత్యేకత. నిపుణులైన చెఫ్‌లతో వంటలు చేయించి మరీ డోర్ డెలివరీ చేస్తారు.
food-meals2

40 మంది..
రెండు సంవత్సరాల క్రితం టీహబ్‌లో ప్రారంభించిన ఈ స్టార్టప్‌లో ప్రస్తుతం 40 మంది సభ్యులున్నారు. నగరంలో 5 కిచెన్స్ నిర్వహిస్తున్నారు. త్వరలో మరో రెండు కిచెన్స్‌ని ప్రారంభించనున్నారు. నగరంతోపాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కూడా ఫిట్‌మీల్‌ని ప్రారంభించే యోచనలో ఉన్నారు. వినియోగదారులకు నూట్రిషన్స్‌ను ప్రత్యక్షంగా కలిపేందుకు యాప్‌ని రూపొందించనున్నారు. మీరు కూడా మీ డైట్ ప్లాన్‌కి తగ్గ ఆహారాన్ని పొందాలనుకుంటే www.fitmeals.co.inలో లాగిన్ అవ్వండి మరి.

4204

More News

VIRAL NEWS