భోజనంతోపాటు జామకాయ తీసుకుంటే..


Thu,October 12, 2017 11:00 PM


* గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు రోజూ భోజనంతో పాటు జామకాయను తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. మూడు నెలలపాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
* జామపండు తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరిగి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.
* యాభై గ్రాముల జామపండు గుజ్జుకు పదిగ్రాముల తేనె కలిపి తీసుకుంటే అలిసిన శరీరానికి శక్తి అందుతుంది.
* రాత్రిపూట భోజనం తర్వాత జామపండు తింటే మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిడిని జయించేందుకు జామపండు మంచి ఔషధం.
* రోజూ జామకాయ తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. చిగుళ్లు, దంతాలు గట్టిపడుతాయి. జామలో ఉండే విటమిన్ సి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడాన్ని
ఆపుతుంది.
* బాగా పండిన జామపండు నుంచి గింజలు తీసేసి పాలు, తేనె కలుపుకొని తాగితే విటమిన్ సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు ఈ మిశ్రమాన్ని టానిక్‌లా వాడవచ్చు.
* చర్మసంబంధిత వ్యాధులకు, కేశసంరక్షణకు జామపండు మేలు చేస్తుంది.

3906

More News

VIRAL NEWS