రోజూ 40 గ్రాముల చీజ్ తింటే..?


Mon,December 4, 2017 05:35 PM

చీజ్ (Cheese) ప్రియులకు శుభవార్త. రోజూ అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఒక చీజ్ ముక్క (దాదాపుగా 40 గ్రాములు)ను తింటే దాంతో గుండె ఆరోగ్యం బాగుంటుందట. హార్ట్ అటాక్‌లు వచ్చే అవకాశం 14 శాతం వరకు తగ్గుతుందట. ఇది మేం చెప్పడం లేదు. చీజ్‌పై తాజాగా యూనివర్సిటీ ఆఫ్ రెడింగ్ సైంటిస్టులు చేసిన పరిశోధనల ద్వారా ఈ విషయం తెలిసింది. అంతేకాదు, ఇలా రోజూ 40 గ్రాముల మోతాదులో చీజ్ తింటే దాంతో ఇతర అనేక లాభాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చీజ్‌ను రోజూ 40 గ్రాముల మోతాదులో తింటే దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. అందులో ఉండే కాల్షియం మన శరీరంలో ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది.

2. చీజ్‌ను రోజూ తింటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు రావు.

3. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

4. చీజ్‌లో ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని మంచి బాక్టీరియా అని పిలుస్తారు. ఈ బాక్టీరియా జీర్ణాశయం, పేగుల్లో ఉంటుంది. ఇది చెడు బాక్టీరియా నుంచి మనకు రక్షణనిస్తుంది.

5. చీజ్‌లో విటమిన్ బి12, జింక్, సెలీనియం, విటమిన్ ఎ, కె2, పాస్ఫరస్, రైబోఫ్లేవిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి.

6. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

7. కీళ్ల నొప్పులు ఉండే వారికి చీజ్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీంతో ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చీజ్‌లో ఫెటా, స్ట్రింగ్, స్విస్, పర్మేషన్, కాటేజ్ అని పలు రకాలు ఉన్నాయి. వీటిని ఆరోగ్యకరమైన చీజ్‌లుగా చెబుతారు. అయితే ఇవే కాకుండా చీజ్‌లో మొత్తం 2వేల రకాలు ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్నాయి. 453 గ్రాముల చీజ్‌ను తయారు చేసేందుకు 4.5 లీట‌ర్ల‌ పాలు అవసరం అవుతాయి. చీజ్‌ను ఆవు, గేదె, మేక పాల నుంచి తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటె, గుర్రం పాల నుంచి కూడా చీజ్‌ను తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న చీజ్ వెరైటీ మొజరెల్లా. ఈ వెరైటీని తింటే దంత సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. దంతాలు దృఢంగా మారుతాయి.

4740

More News

VIRAL NEWS