కొబ్బరినీళ్లతో జుట్టు సురక్షితంగా..


Sun,July 8, 2018 09:43 PM

ఇప్పుడు ఉన్న కాలుష్యం ఇతర కారణాల వల్ల మహిళలకు, పురుషులకు జుట్టు విపరీతంగా ఊడిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మీకోసం..ఒకసారి ట్రై చేయండి.

* కొబ్బరినీళ్ళతో స్కాల్ప్‌ను సర్క్యులర్ మోషన్‌లో మర్దన చేయాలి. అలా 10 నిమిషాల వరకు చేయాలి. తరువాత జుట్టు మొదళ్ళ నుంచి చివర వరకు కూడా కొబ్బరినీళ్ళతో మసాజ్ చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో తలస్నానం చేయాలి.
* ముందుగా జుట్టును షాంపూతో కడగాలి. ఆపిల్ సిడర్ వెనిగార్, కొబ్బరినీళ్ళను ఒక మిశ్రమంలా తయారుచేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని శిరోజాలకు ఐప్లె చేయాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
* కొబ్బరినీళ్ళు, నిమ్మరసంను బాగా కలపాలి. ఈ విశ్రమాన్ని స్కాల్ప్‌పై 5 నిమిషాల పాటు మర్ధన చేయాలి. అలాగే మొత్తం జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
* కొబ్బరినీళ్ళు, తేనె ఈ రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు స్కాల్ప్‌పై మర్దన చేయాలి. అలాగే మొత్తం జుట్టుకు పట్టించి 20 నిమిషాల తరువాత నీటితో తలస్నానం చేయాలి.

4852

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles