చ‌లికాలంలో విట‌మిన్ డి పొందండి ఇలా..!


Thu,November 9, 2017 04:52 PM

చ‌లికాలంలో ప‌గ‌లు త‌క్కువ‌గా రాత్రి ఎక్కువ‌గా ఉంటుద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనికి తోడు ఉద‌యాన్నే సూర్యుడు రావ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. వ‌చ్చినా మంచు కార‌ణంగా అంత త్వ‌ర‌గా సూర్యకిర‌ణాలు భూమిపై ప‌డ‌వు. దీంతో సూర్యకాంతి త‌గినంత‌గా ల‌భించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నలో చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా వ‌స్తే ఎముక‌లు దృఢ‌త్వాన్ని కోల్పోతాయి. డ‌యాబెటిస్ వంటి వ్యాధులు వ‌స్తాయి. బ‌రువు పెరుగుతారు. క‌నుక ఈ స‌మ‌యంలో సూర్య‌కాంతి త‌గినంత‌గా ల‌భించ‌క‌పోయిన‌ప్ప‌టికీ విట‌మిన్ డి ఉన్న ఆహారం తిన‌డం చాలా అవ‌స‌రం. మ‌రి విట‌మిన్ డి మ‌న‌కు ఏయే ప‌దార్థాల్లో ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

డి విటమిన్ సాల్మ‌న్, ట్యునా, మెకరెల్ చేపలు, పాలు, తృణ ధాన్యాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్, పుట్ట గొడుగుల్లో పుష్కలంగా లభిస్తుంది. రోజుకు ఒక గ్లాస్ పాలు, ఆరెంజ్ జ్యూస్ తాగేలా చూసుకోవాలి. గుడ్డులోని పచ్చ సొనలో డి విటమిన్ అధికంగా ఉంటుంది. కానీ తెల్ల, పచ్చ సొనను లాగించేయాలి. దీంతో శరీరానికి శక్తి కూడా వస్తుంది. ఇక ప్రతి రోజు మెనూలో పై ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు సూర్యరశ్మి ఉన్న సమయంలో ఎండకు కాసేపు నిలబడటం మంచిది. చలి పెడుతుందని హాయిగా దుప్పట్లో దూరడం మంచిది కాదు. అలా చేస్తే శ‌రీరానికి అందాల్సిన విట‌మిన్ డి స‌రిగ్గా అందదు. రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు అయినా 60 శాతం శ‌రీరానికి సూర్యకాంతి త‌గిలితే మంచిది. విట‌మిన్ డి స‌మ‌స్య రాదు.

6867

More News

VIRAL NEWS