నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే..


Wed,May 17, 2017 10:47 PM


ఎండ నుంచి కాపాడుకునేందుకు శీతల పానీయాలు తాగడం కంటే, నిమ్మకాయతో షరబత్ చేసుకుని తాగడం ఉత్తమం. ఇంట్లో తయారు చేసిన ఈ సహజమైన రెమెడీతో చాలా లాభాలున్నాయట.
నిమ్మకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు.

* నిమ్మగుజ్జులో సిట్రస్ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది.
* నిమ్మలో చాలా శక్తివంతమైన పైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.
* నిమ్మతొక్కలో ఉండే లిమనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. నిమ్మలో ఉండే 22 రకాల పదార్థాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాన్ని కలిగి ఉంటాయి.
* క్యాన్సర్ అవకాశాన్ని యాభై శాతం తగ్గించే గుణం నిమ్మకాయకు ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోయేందుకు ఇది సహకరిస్తుంది.
* నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ ర్యాడికల్స్‌ను ఎదుర్కొని వృద్ధాప్యాన్ని దరిచేరనీయవు. ఇన్ఫెక్షన్ల బెడదను తగ్గిస్తాయి.
* నిమ్మరసం తాగితే జిహ్మ చాపల్యం అదుపులో ఉంటుంది. నిమ్మలో ఉండే పెక్టిన్ అనే పీచు, త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

2742
Tags

More News

VIRAL NEWS