తీసుకునే ఆహారం కూడా మారితే..


Mon,March 13, 2017 12:05 AM


తీసుకునే ఆహారం భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయన్నది అందరికి తెలిసిన విషయమే. మూడ్‌ను బట్టి తీసుకునే ఆహారం కూడా మారితే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. అందుకు బహుషా మీరు తీసుకునే ఆహారం సరైంది కాకపోవడం కూడా అయిఉండొచ్చు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పడు ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

* విటమిన్ బి6 ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి6ని పైరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇది పాలకూర, ఓట్స్, అక్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది.
* మరో ఫీల్‌గుడ్ విటమిన్ బి12. ఇది కూడా డిప్రెషన్‌ను తగ్గించి ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇది సాల్మన్ చేపలు, పెరుగు, గుడ్లలో పుష్కలంగా ఉంటుంది.

* వీలైనంత ఎక్కువ ప్రొటీన్ కూడా తీసుకోవడం మంచిది. చేపలు, చికెన్, గుడ్డు, వెన్నతీసిన పాలల్లో ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల స్వీట్స్ ఎక్కువగా తినాలనిపించడం, త్వరగా మూడ్ చెడిపోవడం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇందుకోసం ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఎక్కువగా కలిగిన వాల్‌నట్స్, బాదాములు, పల్లీల వంటి గింజలలో ఫైబర్ కూడా తగినంత ఉంటుంది.

* సెరొటోనిన్ ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది. వాల్‌నట్స్, అరటి పండు, పైనాపిల్, కివి, ప్లమ్ వంటి పండ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది.
* డోపమైన్ మూడ్‌ను కంట్రోల్ చెయ్యడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చెయ్యడం వల్ల శరీరంలో డోపమైన్‌స్థాయిలు మెరుగవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చెయ్యడం వల్ల ఉల్లాసంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఎరోబిక్స్, నడక వంటివి అత్యంత మేలు చేస్తాయి.

2342

More News

VIRAL NEWS