సోంపు గింజ‌ల టీ తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!


Sun,May 13, 2018 06:28 PM

సోంపును చాలా మంది మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. కొందరు దీన్ని తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు వేసుకుంటారు. అయితే సోంపుతో ఇవే కాదు, ఇంకా చాలా ఉపయోగాలే ఉన్నాయి. ముఖ్యంగా దీంతో చేసిన టీ ని రోజూ తాగితే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేసి 10 నిమిషాల వరకు మరిగించాలి. అనంతరం ఆ టీ నుంచి సోంపు గింజలను వడపోసి ఆ నీటిని తాగాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆహారం తిన్నాక ఈ టీని తాగితే కింద చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.

1. సోంపు టీని రోజూ తాగితే మడమల‌ నొప్పి తగ్గిపోతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు తగ్గుతాయి.

2. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి.

3. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు పోతాయి. పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయి. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

4. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి పోతాయి. ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో బయటికి పోతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.

6. మూత్రాశయ సమస్యలు పోతాయి. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది.

7. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న వారికి మంచి ఔషధం.

8. బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

9. శరీర మెటబాలిజం రేట్ పెరుగుతుంది. తద్వారా ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

10. నోటి దుర్వాసన పోతుంది. దంత సమస్యలు నయమవుతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.

5741

More News

VIRAL NEWS

Featured Articles