జీర్ణాశయం, పేగులు శుభ్రం అవ్వాలంటే..?


Sun,July 9, 2017 01:45 PM

గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం... ఇవన్నీ జీర్ణాశయం, పేగులకు సంబంధించిన సమస్యలు. వీటితో నేడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవి రావడానికి అనేక కారణాలు కూడా ఉంటాయి. అయితే ఈ సమస్యలు పోవాలంటే అందుకు కింద ఇచ్చిన సింపుల్ టిప్‌ను పాటించి చూడండి. దీంతో జీర్ణాశయం, పేగులు శుభ్రమవడమే కాదు, ముందు చెప్పిన సమస్యలు పోతాయి. ఆ టిప్ ఏమిటంటే...

ఒక కప్పు యాపిల్ పండు ముక్కలు తీసుకుని వాటిపై ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి రోజూ ఒకసారి తినాలి. రోజులో ఎప్పుడు ఈ మిశ్రమాన్ని తిన్నా చాలు, దాంతో జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. యాపిల్ పండులో ఉండే ఫైబర్, ఆలివ్ ఆయిల్‌లో ఉండే పోషకాలు జీర్ణ సమస్యలను నయం చేస్తాయి.

5954

More News

VIRAL NEWS