డిప్రెష‌న్‌ను త‌గ్గించే సీఫుడ్‌..!


Mon,September 10, 2018 03:31 PM

చేప‌లు, రొయ్య‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటి ద్వారా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే వారంలో క‌నీసం రెండు, మూడు సార్లు వీటిని ఆహారంగా తీసుకుంటే డిప్రెష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయి. 18 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 3వేల మంది బ్ల‌డ్ శాంపిల్స్‌ను సేక‌రించిన ప‌లువురు సైంటిస్టులు వాటిని ప‌రీక్షించ‌గా బాధితుల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని నిర్దారించారు. దీంతోపాటు వారిలో కొంద‌రు డిప్రెష‌న్ బారిన ప‌డ్డార‌ని తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో వారికి 3 వారాల పాటు వారానికి రెండు, మూడు సార్లు సీఫుడ్‌ను తినిపించారు. అలా సీ ఫుడ్‌ను తిన్న‌వారిలో 30 శాతం మందికి డిప్రెష‌న్ త‌గ్గింద‌ని నిర్దారించారు. క‌నుక సీఫుడ్‌ను రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల్ల డిప్రెష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

2804

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles