లివ‌ర్ క్లీన్ అవ్వాలంటే.. ఇవి తీసుకోవాలి..!


Thu,October 5, 2017 11:07 AM

మ‌న శరీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోకెల్లా లివ‌ర్ (కాలేయం) పెద్ద‌దైన అవ‌య‌వం. ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు శ‌క్తిని అందించ‌డం వంటి ఎన్నో ప‌నుల‌ను లివర్ నిత్యం చేస్తూనే ఉంటుంది. అయితే నిత్యం మ‌నం తీసుకునే ఆహారంతోపాటు, కాలుష్యం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, అనారోగ్యాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ పనితీరులో మార్పు వ‌స్తుంది. దీంతో మ‌న దేహం మ‌రింత అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను నిత్యం ఆహారంలో తీసుకుంటే లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగుప‌ర‌వ‌చ్చు. దీంతో అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. అంతేకాదు లివ‌ర్‌లో ఉన్న విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి.

బీట్‌రూట్‌, క్యారెట్‌


బీట్‌రూట్‌, క్యారెట్ల‌లో లివ‌ర్‌ను శుద్ధి చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవ‌నాయిడ్స్‌, బీటా కెరోటీన్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఇవి లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగు ప‌రుస్తాయి.

ట‌మాటాలు


గ్లూటాథియోన్ అని పిల‌వ‌బ‌డే ప‌దార్థం టామాటాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ట‌మాటాల‌ను నిత్యం తీసుకుంటే దాంట్లోని ఔష‌ధ కార‌కాలు లివ‌ర్‌ను శుద్ధి చేస్తాయి. దీంతో లివ‌ర్ బాగా ప‌నిచేస్తుంది.

పాల‌కూర‌


లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో పాల‌కూర బాగా ప‌నిచేస్తుంది. దాంట్లోని ఔష‌ధ గుణాలు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

నిమ్మ‌జాతి పండ్లు


విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌తోపాటు ఆ జాతి పండ్ల‌న్నీ లివ‌ర్ ఆరోగ్యం కోసం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. లివ‌ర్‌ను శుద్ధి చేసే గుణాలు వాటిలో ఉన్నాయి. వాటిని త‌ర‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

క్యాబేజీ


ఐసోథ‌యోసయ‌నేట్స్ అని పిల‌వ‌బ‌డే ఔష‌ధ కార‌కాలు లివ‌ర్‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతాయి. అవి క్యాబేజీలో ఎక్కువ‌గా ఉంటాయి. క్యాబేజీని మ‌న ఆహారంలో త‌ర‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ప‌సుపు


కార్సినోజెన్లు అన‌బ‌డే విష‌పూరిత ర‌సాయ‌నాలు లివ‌ర్‌లో పేరుకుపోతుంటాయి. వాటిని తొల‌గించ‌డంలో పసుపు బాగా ప‌నిచేస్తుంది. దాంతో లివ‌ర్ ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

వాల్‌న‌ట్స్‌


వాల్‌నట్స్‌లో గ్లూటాథియోన్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవ‌న్నీ లివ‌ర్‌ను శుభ్రం చేసి దాని ఆరోగ్యం మెరుగు ప‌డేలా చేస్తాయి.

అవ‌కాడోలు


అవ‌కాడోలు కూడా లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగు ప‌రుస్తాయి. లివ‌ర్‌లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తాయి.

యాపిల్స్‌


లివ‌ర్‌ను శుభ్ర ప‌రుచుకోవాలంటే నిత్యం ఒక యాపిల్‌ను తింటే చాలు. దీంతో లివ‌ర్ ప‌నిత‌నం పెరుగుతుంది. తద్వారా అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి.

వెల్లుల్లి


శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాలే కాదు, లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ వెల్లుల్లి బాగానే ప‌నిచేస్తుంది. వెల్లుల్లిలో ఆలిసిన్‌, సెలీనియం వంటి ఔష‌ధ కారకాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇవి లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

గ్రీన్ టీ


గ్రీన్ టీలో క్యాథెకిన్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌కు చాలా మంచి చేస్తాయి. లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను బ‌య‌టికి పంపుతాయి.

ఆలివ్ ఆయిల్‌


లివ‌ర్‌లోని విష పదార్థాల‌ను తొల‌గించ‌డంలో ఆలివ్ ఆయిల్ కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని నిత్యం మ‌న వంటల్లో భాగం చేసుకుంటే చాలు. దాని వ‌ల్ల లివ‌ర్‌కు ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంది.

9133

More News

VIRAL NEWS

Featured Articles