కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే చేపలు..!


Tue,November 14, 2017 01:38 PM

తరచూ కీళ్ల నొప్పులు, వాపులు మిమ్మల్ని బాధిస్తున్నాయా ? నొప్పి తట్టుకోలేకుండా ఉన్నారా ? ఎన్ని మందులు వాడినా సమస్య అలాగే ఉందా ? అయితే వారంలో కనీసం 2 సార్లు చేపలను తినడం అలవాటు చేసుకోండి. దీంతో వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరానికి అందుతాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

వారంలో రెండు సార్లు చేపలను తినగలిగితే కీళ్ల నొప్పులు, వాపులకు చెక్ పెట్టవచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా చేపలను తింటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరింత సమృద్ధిగా లభిస్తాయి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే చేపలను తినలేని వారు రోజూ గుప్పెడు అవిసెగింజలు లేదా బాదం, వాల్‌నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, విటమిన్ సి ఉండే పండ్లు తింటే చాలు. దాంతో కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయట పడవచ్చు.

4703

More News

VIRAL NEWS