విభూతి ధరిస్తే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?


Sat,June 17, 2017 03:01 PM

హోమ గుండం లేదా ధునిలో హోమ వస్తువులు దహనమవ్వగా మిగిలిన హోమ భస్మాన్ని విభూతి అంటారు. హోమ గుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవు నెయ్యి పోస్తారు. ఇక ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు, పిడకలు, రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు, నవ ధాన్యాలు, గంధపు చెక్కలు, నేరేడు, సాంబ్రాణి, ఆవు నెయ్యి, అగర్‌బత్తీలు వంటివి వేస్తారు. నిజానికి ఆయుర్వేదం పరంగా ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే. ఈ క్రమంలో ధునిలో దహనం అయిన ఈ పదార్థాల భస్మాన్ని (విభూతిని) కొందరు భక్తులు నుదుటన ధరిస్తారు. శివాలయాలన్నింటిలోనూ విభూతి తప్పనిసరిగా ఉంటుంది.
vibhuti

లాభాలివే...


విభూతిని కొందరు నుదుటన ధరిస్తారు. ఇంకొందరు ఛాతి, చేతులపై కూడా రాసుకుంటారు. ఈ క్రమంలో విభూతిని రాసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* విభూతిని ధరించిన వారిని దుష్ట గ్రహాలు, పిశాచాలు, సర్వ రోగాలు సమీపించవు.
* బ్రహ్మ రాసిన రాతను మార్చే శక్తి విభూతికి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
* నవగ్రహల బాధలు ఉన్న వారు విభూతిని రోజూ ధరిస్తే ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుంది.
* దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో జరుగుతాయి.
* విభూతిని నుదుటిపై ధరిస్తే ఆ ప్రాంతంలో ఉండే నాడులు ఉత్తేజమవుతాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* కుటుంబ సభ్యుల మధ్య ఉండే కలహాలు పోతాయి.
* అన్ని రకాల తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* అనేక ఆయుర్వేద మందుల్లో బూడిద లేదా భస్మాన్ని వాడుతారు. కనుక ఇది సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు తగ్గుతాయి. సైనస్ తగ్గిపోతుంది.
* చర్మంపై ముడతలు రావు. కాంతివంతంగా మారుతుంది.
* శరీరంలోకి ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది. ఇది ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

5649

More News

VIRAL NEWS