సీజ‌న‌ల్ ఫ్రూట్ ఆరేంజ్‌తో క‌లిగే లాభాలు


Fri,December 1, 2017 05:29 PM

కమలా పండ్ల సీజన్ వచ్చేసింది. వీటిల్లో ఉండే విటిమిన్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని చాలామంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. అలా కాకుండా నేరుగా తింటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకోండి.

-కమలా పండ్లను నేరుగా తినడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

-ఇందులో ఉండే ఎ విటమిన్ దృష్టిలోపాలను నివారిస్తుంది.

-ఈ పండులో మాంసకృత్తులు, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి.

-ఇందులోని ఎ,సి విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోప్లేవిన్ మెండుగా ఉంటాయి.

-క్షయ, ఉబ్బసంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ కమలాపండును ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

-మూత్రపిండంలో రాళ్లు ఏర్పడకుండా, శరీరంలో కొవ్వు స్థాయి పెరుగకుండా కమలాపండు కాపాడుతుంది.

2905

More News

VIRAL NEWS