రెండుమూడు యాలకులు, లవంగాలు, ఓ అల్లం ముక్క


Tue,October 10, 2017 07:15 PM

ఇలాచి, లవంగాలు వంటల్లో రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటివల్ల ఎన్నో లాభాలున్నాయి.
ఆవేంటో ఓసారి చూద్దాం...
- రక్తహీనత ఉన్న వారు రోజూ యాలకులు తింటే రక్త వృద్ధి జరుగుతుంది.
-రక్త సరఫరా మెరుగవుతుంది. దీనివల్ల గుండె సమస్యలు చాలావరకు తొలగిపోతాయి.
-యాలకులు తింటే నోటి దుర్వాసన పోతుంది. సీగరెట్ల తాగేవారు స్మోక్ చేసిన తరువాత యాలకులను తింటే నోటినుంచి పోగాకు వాసన రాదు.
- భోజనం చేసిన వెంటనే ఒకట్రెండు యాలకులను నమిలి తింటే అజీర్తి సమస్య ఉండదు. నోరు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.
-ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో కూడా యాలకులు, లవంగాలు బాగా పనిచేస్తాయి.
- బాడీలోని విషపదార్థాలు, వ్యర్థాలను బయటికి పంపించడంలో ఇవి మొనగాళ్లు.
- రెండుమూడు యాలకులు, లవంగాలు, ఓ అల్లం ముక్కను కాసిన్న దనియాలతో కలిపి పోడి చేసి పెట్టుకోవాలి. రోజూ గ్లాస్ వేడినీటిలో వేసుకుని తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

5945
Tags

More News

VIRAL NEWS