బేకింగ్ సోడా + నిమ్మ‌ర‌సం = అధిక బ‌రువుకు చెక్


Sun,July 16, 2017 05:25 PM

బేకింగ్ సోడాను మ‌నం ప‌లు వంట‌కాల్లో ఉప‌యోగిస్తాం. ఇక బేక‌రీ నిర్వాహ‌కులైతే ఇది లేకుండా ఏ బేక‌రీ ఐట‌మ్స్ చేయ‌రు. ఎన్నో ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో బేకింగ్ సోడాను వారు వాడుతారు. అయితే ఇది వంట‌ల కోస‌మే కాదు, మ‌న శ‌రీర బ‌రువును త‌గ్గించ‌డంలోనూ స‌హాయ ప‌డుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాలా క‌ల‌పాలి. బేకింగ్ సోడా నీటిలో పూర్తిగా క‌రిగే వ‌ర‌కు క‌లియ‌బెట్టి త‌రువాత ఆ నీటిలో ఒక టీస్పూన్‌ నిమ్మ‌ర‌సం వేసి మళ్లీ క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తాగాలి. దీన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తాగాల్సి ఉంటుంది. ఈ డ్రింక్ తాగాక 30 నిమిషాల త‌రువాతే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. రోజూ దీన్ని తాగుతుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది.

6442

More News

VIRAL NEWS