న‌ల్ల జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడి.. స‌ర్వ‌రోగ నివారిణి..!


Tue,March 13, 2018 02:24 PM

నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, కంటి చూపు పోవ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, అధిక బ‌రువు, గుండె స‌మ‌స్య‌లు, మ‌ధుమేహం ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి చాలా మందికి వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అనేక మంది డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు తిరిగినా ఫ‌లితం లేద‌ని వాపోతున్నారు. అయితే ఇలాంటి వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌కు తోడు కింద చెప్పిన విధంగా న‌ల్ల జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడుల‌తో ఒక మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని దాన్ని రోజూ వాడితే దాంతో పైన చెప్పిన రోగాలే కాదు, ఇంకా అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయి. ఆయుర్వేదంలో ఈ మిశ్రమానికి అధిక ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

కావ‌ల్సిన ప‌దార్థాలు...


మెంతులు - 250 గ్రాములు
వాము - 100 గ్రాములు
న‌ల్ల జీల‌క‌ర్ర - 50 గ్రాములు

త‌యారీ విధానం...


పైన తెలిపిన మూడు పదార్థాలను నిర్దేశించిన మోతాదులో తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. అనంత‌రం మూడింటినీ కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొర‌బ‌డ‌ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం...


పైన చెప్పిన విధంగా మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకున్నాక దాన్ని రోజూ రాత్రి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. త‌రువాత ఇక ఏమీ తిన‌రాదు. తినాల్సి వ‌స్తే క‌నీసం 1 గంట వ‌ర‌కు ఆగాలి. దీన్ని ఎవ‌రైనా తాగ‌వ‌చ్చు. ఇలా ఈ మిశ్ర‌మాన్ని 3 నెల‌ల పాటు నిరంత‌రాయంగా వాడాక‌, 15 రోజులు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ అదే విధంగా వాడుకోవ‌చ్చు. దీంతో కింద చెప్పిన విధంగా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.

1. ప్రతి రోజు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి.

2. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. చెడు కొలెస్ట్రాల్ మాయ‌మ‌వుతుంది.

3. ర‌క్తం శుభ్ర‌ప‌డుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు పోతాయి.

4. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. శ‌రీరం దృఢంగా త‌యార‌వుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

5. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్నీ త‌గ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. జుట్టు బాగా పెరుగుతుంది.

6. గ్యాస్‌, అసిడిటీ, మల బద్దకం, అజీర్ణం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు శాశ్వతంగా నివార‌ణ అవుతాయి. దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.

7. గతంలో తీసుకున్న అల్లోపతి మందుల దుష్ప్రభావాలను ఇది త‌గ్గిస్తుంది. దంతాలు దృఢంగా మారుతాయి.

8. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

9490

More News

VIRAL NEWS

Featured Articles