ఎముకలు దృఢంగా మారాలంటే..?


Thu,April 20, 2017 10:03 AM

మన శరీరంలో ఎముకలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. శరీరం మొత్తం ఎముకల దృఢత్వంపైనే ఆధారపడి ఉంటుంది. వాటిలో ఏ చిన్న లోపం వచ్చినా, అప్పుడు తీవ్రమైన బాధ, నొప్పి వస్తుంది. వయస్సు మీద పడుతున్నకొద్దీ ఎముకల పటుత్వం కూడా తగ్గుతుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు, ఎముకలు ఎప్పటికీ దృఢత్వాన్ని కలిగి ఉండేందుకు పలు సూచనలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
foods-for-bones
1. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను రోజూ తినాలి. దీంతో వాటిలో ఉండే కాల్షియం ఎముకలకు అందుతుంది. తద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి.

2. పాలు లేదా దాని సంబంధ పదార్థాలను రోజూ సేవించాలి. వాటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా మారుతాయి.

3. టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకుని ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉండాలి. ఇలా చేసినా ఎముకలు దృఢంగా అవుతాయి.

4. ఒక కప్పు వేడి పాలలో టీస్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకోవాలి. దీంతో ఎముకలకు పటుత్వం వస్తుంది.
foods-for-bones
5. ఒక గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున కలిపి రోజుకొక సారి తాగితే ఎముకలకు మంచిది.

6. మునగ కాయలను ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా కాల్షియం బాగా అందుతుంది. అది ఎముకలకు మేలు చేస్తుంది.

7. రాత్రి పూట గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటి పొట్టు తీయాలి. వాటిని పేస్ట్‌లా చేసి ఒక గ్లాస్ ఆవు పాలలో ఆ మిశ్రమాన్ని కలిపి తీసుకోవాలి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి.
foods-for-bones
8. టమాటాలను తరచూ తింటూ ఉన్నా అందులో ఉండే కాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది.

9. క్యారెట్, బొప్పాయి, ద్రాక్ష పండ్లు తరచూ తింటూ ఉన్నా ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

5997

More News

VIRAL NEWS