క‌రివేపాకుతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా దూరం చేసుకోండి..!


Mon,February 12, 2018 03:41 PM

క‌రివేపాకును నిత్యం మ‌న వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అయితే వంట‌లు తినేట‌ప్పుడు మాత్రం దీన్ని పార‌వేస్తాం. కానీ మేం ఇప్పుడు చెప్ప‌బోయేది తెలిస్తే ఇక మీరు క‌రివేపాకును అస్స‌లు ప‌డేయ‌రు. అంత‌టి ఔష‌ధ గుణాలు దీంట్లో ఉన్నాయి మ‌రి. ఈ క్ర‌మంలో క‌రివేపాకు వ‌ల్ల ఎలాంటి అనారోగ్య సమ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. దీంతోపాటు డయాబెటిస్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

2. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది. ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.

3. కమిలిన గాయాలకు, దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి.

4. గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి.

5. పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది.

6. కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా, లేదా వాటి జ్యూస్ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు.

7. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది.

8. కరివేపాకుల పొడిని కూరలు, సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, పోషకాలు అందుతాయి.

9. ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

3451

More News

VIRAL NEWS