బెండ‌కాయ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే..?


Thu,October 12, 2017 10:23 AM

బెండ‌కాయ‌ను మ‌నం త‌ర‌చూ కూర చేసుకుని తింటూనే ఉంటాం. దీంతో ఫ్రై, పులుసు వంటివి చేసుకోవ‌చ్చు. అవి చాలా రుచిక‌రంగా ఉంటాయి. అయితే కేవ‌లం రుచికే కాదు, బెండ‌కాయ‌తో మ‌న‌కు అనేక‌ ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అయితే అందుకు బెండ‌కాయ నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాల్సి ఉంటుంది. మ‌రి ఆ నీటిని ఎలా త‌యారు చేయాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

రెండు బెండ‌కాయ‌లను తీసుకుని బాగా క‌డ‌గాలి. వాటిని మొద‌లు, చివ‌ర భాగాల‌ను క‌ట్ చేయాలి. అనంతరం ఒక్కో బెండ కాయను నిలువుగా చీరాలి. కానీ పూర్తిగా చీర‌కూడ‌దు. చివ‌రి భాగం వ‌ర‌కు మాత్ర‌మే చీరి వ‌దిలేయాలి. అలా రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేశాక ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో వాటిని వేయాలి. ఆపై మూత పెట్టాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక‌, ఉద‌యాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండ‌కాయ‌ల‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పైన చెప్పిన విధంగా బెండ‌కాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతాయి. అల్స‌ర్లు ఉంటే త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం న‌య‌మ‌వుతాయి.

2. ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, సి, కె, మెగ్నిష‌యం, పాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. దీంతో చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.

3. ర‌క్తం స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ త‌గ్గుతుంది.

4. మ‌ధుమేహం న‌య‌మ‌వుతుంది. ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

5. ఎముక‌లు దృఢంగా మారుతాయి. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. వేడి శ‌రీరం ఉన్న వారు తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.

7. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోయి అధిక బ‌రువు ఇట్టే త‌గ్గుతారు.

8. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

9. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.

8832

More News

VIRAL NEWS

Featured Articles