రాత్రంతా నాన‌బెట్టిన కిస్‌మిస్ పండ్ల‌ను ఉద‌యాన్నే తింటే ?


Sat,June 9, 2018 08:55 PM

కిస్ మిస్ పండ్ల‌ను మ‌నం ప‌లు ర‌కాల స్వీట్లు, తీపి వంట‌కాల్లో వేస్తుంటాం. వీటి వ‌ల్ల ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక కొంద‌రైతే కిస్ మిస్ పండ్ల‌ను నేరుగా అలాగే తింటారు. అవిచ్చే రుచి అలా ఉంటుంది మ‌రి. అయితే కిస్ మిస్ పండ్ల‌ను ఎలా తిన్న‌ప్ప‌టికీ వాటి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలో వీటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటే దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కిస్ మిస్ పండ్ల‌లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. పైన చెప్పిన‌ట్టుగా నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే దాంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

2. విట‌మిన్ బి, పొటాషియం వంటి పోష‌కాలు కిస్ మిస్ పండ్ల‌లో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధుల‌కు అడ్డుగోడ‌గా నిలుస్తాయి.

3. ఉద‌యాన్నే వీటిని తిన‌డం వ‌ల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉద్యోగుల‌కు, పిల్ల‌ల‌కు కిస్ మిస్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.

4. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట‌రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

5. ఉదయాన్నే కిస్ మిస్ ల‌తోపాటు కొన్నివెల్లుల్లి రేకుల్ని ప‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది.

6. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.

7. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

8. ఈ పండ్ల‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.

9. వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

12338

More News

VIRAL NEWS