ముల్లంగిని రెగ్యుల‌ర్‌గా తింటే క‌లిగే లాభాలివే..!


Mon,February 12, 2018 01:48 PM

ఆకుపచ్చని ఆకులు, తెల్లని దుంపతో ఘాటైన వాసనను కలిగి ఉండే ముల్లంగి అంటే దాదాపు అధిక శాతం మంది పెదవి విరుస్తారు. అయితే దీన్ని పక్కన పెడితే విలువైన ఆరోగ్యాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే పలు అనారోగ్యాలను దూరం చేసే ఔషధ కారకాలు ముల్లంగిలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని మనం తరచూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముల్లంగితో కూర‌లు చేసుకుని తిన‌వచ్చు. లేదంటే దాని ర‌సం తీసి తాగ‌వచ్చు. ఎలా తీసుకున్నా ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ముల్లంగి అద్భుతంగా పని చేస్తుందని చెప్పవచ్చు. కాలేయంలో పేరుకుపోయే విష పదార్థాలను బయటికి పంపివేయడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కామెర్లు వచ్చిన వారు ముల్లంగి రసాన్ని తీసుకుంటే త్వరగా తగ్గిపోతాయి. ఆ సమయంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే ముల్లంగి రసాన్ని తీసుకోవాలి.

2. ముల్లంగి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు ఉండవు. శరీరానికి ఆక్సిజన్ ను సరిగ్గా అందేలా చూడడంలోనూ ముల్లంగి ఉపయోగపడుతుంది.

2. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ముల్లంగి ఉపయోగపడుతుంది. ఇది పైల్స్ సమస్యను తగ్గిస్తుంది.

3. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పితో బాధపడే వారు ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యానికి ముల్లంగి ఉపయోగపడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

4. ముల్లంగి రసం తాగితే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలిని ఇది నియంత్రిస్తుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

5. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ముల్లంగిలో ఉన్నాయి.

6. చర్మానికి మేలు చేసే గుణాలు ముల్లంగిలో ఉన్నాయి. ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి.

7. తేనెటీగ, పురుగు కుట్టడం వల్ల వచ్చే నొప్పిని, వాపును తగ్గించేందుకు కూడా ముల్లంగి ఉపయోగపడుతుంది. ముల్లంగి రసంలో నల్ల ఉప్పును కలుపుకుని తాగితే ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. దీంతోపాటు జ్వరం కూడా తగ్గుతుంది.

8. నోరును తాజాగా ఉంచడంలో, రక్త సరఫరాను మెరుగు పరచడంలో, కడుపులో మంట, నొప్పిని తగ్గించడంలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది.

4791

More News

VIRAL NEWS

Featured Articles