చుండ్రును త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్‌..!


Sun,February 11, 2018 03:49 PM

బాక్టీరియా, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌డం, చ‌ర్మం పొడిబారిపోవ‌డం, స‌రైన శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌న‌కు చుండ్రు ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే చాలా మంది ఏవేవో షాంపూలు వాడి, క్రీములు రాసి చుండ్రును వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. కానీ కింద ఇచ్చిన కొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బంతి చెట్టు ఆకుల‌ను 50 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని 250 ఎంఎల్ కొబ్బ‌రినూనెలో వేసి ఆ ద్ర‌వాన్ని మ‌రిగించాలి. దీంట్లో 2 చిటికెల క‌ర్పూరం వేయాలి. మ‌ళ్లీ స‌న్న‌ని మంట‌పై 15 నిమిషాల పాటు ఆ ద్ర‌వాన్ని మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని రోజూ ఆయిల్‌లా త‌ల‌కు రాస్తుంటే చుండ్రు త‌గ్గిపోతుంది.

2. మెంతుల్ని 2 టేబుల్ స్పూన్స్ మోతాదులో తీసుకుని వాటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ మెంతుల‌ను తీసి మిక్సీ ప‌ట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లేదా అంతే మోతాదులో నిమ్మ‌రసాన్ని క‌లిపి అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి కొంత సేపు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల చుండ్రు పోతుంది.

3. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు , 4 టేబుల్ స్పూన్ల‌ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ను ఒక పాత్ర‌లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తలకు పట్టించాలి. ఇలా 15 నిముషాల పాటూ ఉంచుకుని చల్లని నీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల కూడా చుండ్రు పోతుంది.

4. బేకింగ్ సోడా 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల‌ నీటిని తీసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు అట్టలు అట్టలుగా మొత్తం రాలిపోతుంది. బేకింగ్ సోడా ఇలా చాలా చక్కగా పని చేస్తుంది. త‌ర‌చూ ఈ టిప్ పాటిస్తే చుండ్రు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. నిమ్మ‌ర‌సం 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టిని కలిపి జుట్టు కుదుళ్లు త‌గిలేలా ప‌ట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

6. చుండ్రుని తొల‌గించ‌డంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా బాగానే ప‌నిచేస్తుంది. కాక‌పోతే దాన్ని డైరెక్ట్‌గా వాడ‌కూడ‌దు. దానికి నీటిని క‌లిపి ఉప‌యోగించాలి. 3 టేబుల్ స్పూన్ల‌ ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు 3 టేబుల్ స్పూన్ల‌ మంచినీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా ప‌ట్టించాలి. అనంత‌రం కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో చుండ్రు పోతుంది.

7. అలోవెరా జెల్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా రాయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు, దాని వ‌ల్ల వ‌చ్చే దుర‌ద త‌గ్గిపోతాయి.

8. మూడు, నాలుగు రోజుల పాటు బాగా పులిసిన పెరుగును కొంత తీసుకుని త‌ల‌కు ప‌ట్టించాలి. 20 నిమిషాలు ఆగాక క‌డిగేసుకోవాలి. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య పోతుంది.

6647

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles