ఊపిరితిత్తులను స‌హ‌జ‌సిద్ధంగా శుభ్రం చేసే అద్భుత‌మైన చిట్కాలు..!


Sat,June 9, 2018 06:58 PM

నేటి తరుణంలో గాలి కాలుష్యం వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం ఈ కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్ కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ

రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి.

2. నిమ్మరసం

ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

3. క్యారెట్ జ్యూస్

ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

4. పొటాషియం

ఆరెంజ్, అరటిపండు, కంద‌గ‌డ్డ‌లు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి.

5. అల్లం

ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

6. పుదీనా

ఉదయాన్నే పరగడుపున 4, 5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

7. ఆముదం

కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం ఛాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. వాటిల్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

9789

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles