పెద్ద పేగును శుభ్రం చేసే అద్భుతమైన చిట్కాలు..!


Sun,April 15, 2018 01:59 PM

మన శరీరంలో పెద్ద పేగు చాలా ముఖ్యమైన భాగాల్లో ఒకటి. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థం అంతా పెద్ద పేగు ద్వారా బయటకు వస్తుంది. అయితే జీర్ణ సమస్యలు ఉన్న వారికి వ్యర్థ పదార్థాలు సరిగ్గా బయటకు రాక అక్కడే ఉండిపోతాయి. దీంతో శరీరం విషతుల్యంగా మారి అనారోగ్యాలకు గురవుతుంది. కనుక పెద్ద పేగులో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండాలి. అలా ఉండేందుకు కింద చెప్పిన పలు సూచనలు పాటిస్తే చాలు. దీంతో పెద్ద పేగు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే పెద్ద పేగును శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం అర గ్లాస్ యాపిల్ జ్యూస్‌ను తాగుతుంటే చాలు. దాంతో పెద్ద పేగు శుభ్రమవుతుంది. అందులో పేరుకుపోయే వ్యర్థాలు సులభంగా బయటకి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు.

2. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నిమ్మరసం, 2 టీస్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపున రోజూ తాగాలి. ఇలా చేసినా పెద్ద పేగు శుభ్రమై ఆరోగ్యంగా ఉండవచ్చు.

3. నిత్యం రెండు పూటలా ఒక కప్పు పెరుగును అలాగే తింటే పెద్ద పేగు శుభ్రంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

4. పాలకూర, బీట్‌రూట్, క్యారెట్, టమాటో, కీరదోసలలో దేని జ్యూస్‌నైనా రోజూ ఒక గ్లాస్ మోతాదులో తాగితే పెద్ద పేగు శుభ్రమవుతుంది.

5. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే ఫలితం ఉంటుంది.

6. ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల నిమ్మరసం, 1 టీస్పూన్ అలోవెరా జెల్‌ను వేసి బాగా కలిపి తాగినా పెద్ద పేగును శుభ్రం చేసుకోవచ్చు.

7. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

11858
Tags

More News

VIRAL NEWS

Featured Articles