పైల్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!


Tue,June 12, 2018 08:47 AM

పైల్స్‌... ఈ స‌మ‌స్య ఎవ‌రికైనా వ‌చ్చిందంటే చాలు. అప్పుడు క‌లిగే బాధను మాటల్లో చెప్ప‌లేం. కాల‌కృత్యాలు తీర్చుకుంటానికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా టాయిలెట్‌లో న‌ర‌క యాత‌న అనుభ‌వించాల్సిందే. ఆ త‌రువాత‌ కూడా మంట‌, నొప్పితో స‌త‌మ‌తం అవ్వాల్సిందే. అయితే పైల్స్ అనేవి రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువ‌గా తిన‌డం, ఎక్కువ‌గా కూర్చుని ఉండ‌డం.. వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కార‌ణాలు. ఈ క్ర‌మంలో ఏ కార‌ణం వ‌ల్ల పైల్స్ స‌మ‌స్య‌ వ‌చ్చినా అది ఓ ప‌ట్టాన త‌గ్గ‌దు. అయితే కింద ఇచ్చిన కొన్ని చిట్కాలు పాటిస్తే దాంతో పైల్స్ స‌మ‌స్య‌ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఒక పాత్ర‌లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్‌), మూడు వెల్లుల్లి రెబ్బ‌లు వేయాలి. అనంత‌రం ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్ర‌మం మ‌రిగాక దాన్ని చ‌ల్లార్చి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పైల్స్ బాధించ‌వు.

2. చ‌మోమిల్ (తెల్ల చామంతి) పూవును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్ష‌న్ కాయాలి. ఆ డికాక్ష‌న్‌ను చ‌ల్లార్చి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే ఫ‌లితం ఉంటుంది.

3. చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ తీసుకుని అందులో కొన్ని కాట‌న్ బాల్స్ వేసి నాన‌బెట్టాలి. కొద్ది సేపు ఆగాక వాటిని తీసి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే పైల్స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. క‌ల‌బంద (అలోవెరా) ఆకుల‌ను తీసుకుని వాటిని మ‌ధ్య‌లోకి చీల్చి వాటి నుంచి గుజ్జును సేక‌రించాలి. దాన్ని పైల్స్‌పై అప్లై చేస్తే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

5. ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం ర‌సం, తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌బిస్తుంది.

6. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాట‌న్ బాల్స్ ముంచి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. దీంతో పైల్స్ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉన్నందున ఇది పైల్స్‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నంగా ప‌నిచేస్తుంది.

7. టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ త‌గ్గిపోతాయి.

2969

More News

VIRAL NEWS