ల‌వంగాల టీ తాగితే ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Mon,May 14, 2018 07:00 PM

ల‌వంగాల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. వీటి వ‌ల్ల వంట‌ల‌కు మంచి వాస‌న మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని రుచి కూడా వ‌స్తుంది. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంటల్లో ల‌వంగాల‌ను వాడుతారు. అయితే ల‌వంగాల‌తో చేసే టీ గురించి మీరెప్పుడైనా విన్నారా..? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో, దాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగం టీ తయారీకి కావల్సిన పదార్థాలు:


లవంగాలు - 1 టీ స్పూన్
నీళ్ళు - ఒక గ్లాసు
తేనె - 1 టీ స్పూన్

తయారు చేసే విధానం...


ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాస్‌ నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత లవంగాల పొడి వేసి 10 నిముషాలు బాగా మరిగించాలి. స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకునే వారు 20 నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వడగట్టి , అందులో రుచికి సరిపడా తేనె మిక్స్ చేసి తాగితే సరిపోతుంది. ఇంకా ఇతర ఫ్లేవర్ కావాల‌ని కోరుకునే వారు పుదీనా, తులసి వంటి ఆకులను లవంగం పొడి ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. దీంతో చక్కటి రుచితో పాటు కాస్త ఘాటుగా కూడా ఉండే లవంగం టీ త‌యార‌వుతుంది. దీన్ని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ల‌వంగం టీని తాగితే దంతాలు, చిగుళ్ల నొప్పి త‌గ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

2. ల‌వంగం టీని రోజుకు 3 పూట‌లా తాగితే జ్వ‌రం త‌గ్గుతుంది.

3. ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం కావాలంటే లవంగం టీని తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. సైన‌స్ ఉన్న వారు ఈ టీని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. జీర్ణ సమ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి పోతాయి.

5. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. క‌డుపు నొప్పి త‌గ్గుతుంది.

6. ల‌వంగం టీని చ‌ల్లార్చి ఫ్రిజ్‌లో ఉండే ఐస్ ట్రేల‌లో పోయాలి. కొంత సేప‌టికి క్యూబ్స్ త‌యార‌వుతాయి. వీటిని శ‌రీరంలో నొప్పులు ఉన్న చోట మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాస్తే వెంట‌నే నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల‌నొప్పులు, కండ‌రాలు వాపు, నొప్పి త‌గ్గుతాయి.

7. ల‌వంగం టీని చల్లార్చి చ‌ర్మంపై రాసుకుంటే దుర‌ద‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు పోతాయి. చ‌ర్మానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

6196

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles