అధికంగా చెమ‌ట వ‌స్తుంటే.. ఇలా చేయాలి..!


Wed,April 19, 2017 03:19 PM

ఏ కాలంలోనైనా మ‌న శ‌రీరానికి గాలి త‌గులుతూ ఉన్న‌ప్పుడే చెమ‌ట రాకుండా ఉంటుంది. గాలి త‌గ‌ల‌క‌పోతే వెంట‌నే చెమ‌ట ప‌ట్టేస్తుంది. ఇక ఈ స‌మ‌స్య ఎండాకాలంలో ఇంకా అధికంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో కొంద‌రికి చెమ‌ట‌తోపాటు శ‌రీరం మొత్తం దుర్వాస‌న కూడా వ‌స్తుంటుంది. ఈ స‌మ‌స్యల నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక చిన్నపాటి బౌల్‌లో కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని దాంట్లో 10 గ్రాముల కర్పూరం పూర్తిగా కరిగేలా చేయాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని స్నానం చేసిన తరువాత చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో రాయాలి. దాదాపు 45 నుంచి 60 నిమిషాల వరకు ఆయా ప్రదేశాలను అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే అధికంగా వచ్చే చెమట తగ్గుతుంది.

2. అధిక చెమటను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాస్తే చాలు. సమస్య నుంచి బయట పడవచ్చు.

3. ఆలుగడ్డలను మధ్యలోకి కట్ చేసి ఆ ముక్కలను శరీర భాగాలపై రాయాలి. అనంతరం కొంత సేపు దాన్ని అలాగే వదిలేయాలి. దీంతో ఆయా భాగాలు పూర్తిగా పొడిబారిపోతాయి. తరువాత నీటితో కడిగేస్తే సరిపోతుంది.

4. రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్‌ను తాగినా అధికంగా వచ్చే చెమట నుంచి విముక్తి పొందవచ్చు.

5. ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

6. రెండు టీస్పూన్ల వెనిగర్, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు భోజనానికి ఒక గంట ముందుగా తాగాలి. ఇలా చేస్తే అధిక చెమట నుంచి బయటపడవచ్చు.

7. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, నిమ్మ ర‌సాల‌ను బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని శ‌రీర భాగాల‌పై రాసుకున్నా చెమ‌ట స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

2805

More News

VIRAL NEWS