ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసే ఎఫెక్టివ్ టిప్స్..!


Thu,August 3, 2017 12:03 PM

నేటి త‌రుణంలో గాలి కాలుష్యం వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న‌ది. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం ఈ కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా క్లీన్‌ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ
రోజుకు 2 నుంచి కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి.

2. నిమ్మరసం
ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

3. క్యారెట్ జ్యూస్
ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

4. పొటాషియం
ఆరెంజ్, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి.

5. అల్లం
ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

6. పుదీనా
ఉదయాన్నే పరగడుపున 4,5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

7. ఆముదం
కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం చాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

3408

More News

VIRAL NEWS