రక్తహీనత నుంచి బయటపడేసే అద్భుతమైన చిట్కాలు..!


Tue,August 7, 2018 07:09 PM

నేటి తరుణంలో అనేక మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలుంటున్నాయి. పులుపు, ఉప్పు అధికంగా తీసుకోవడం, పోషకాహార లోపం, మధ్యాహ్నం నిద్ర లేదా అతి నిద్ర, అజీర్ణం, మలబద్దకం, స్త్రీలకు రుతు సమస్యలు, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తున్నది. అయితే రక్తహీనత సమస్యకు మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలే ఔషధాలుగా పనిచేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో 15 గ్రాముల వంట ఆముదాన్ని కలిపి రాత్రి నిద్ర పోవడానికి ముందు సేవించాలి. ఇలా వారంలో ఒక్కసారి మాత్రమే చేయాలి. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

2. సైంధవ లవణం 1/8 టీస్పూన్, 2 టీస్పూన్ల తేనె, 30 ఎంఎల్ నిమ్మరసం తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తాగాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని సేవించాలి. రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

3. ఒక కప్పు బీట్‌రూట్ రసం, అంతే మోతాదులో యాపిల్ పండు రసం తీసుకుని రెండింటినీ కలిపి తాగాలి. రోజూ ఈ రసం తీసుకుంటే కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

4. బాగా పండిన అరటిపండును రెండు టీస్పూన్ల తేనెతో కలిపి తినాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే రక్తహీనత సమస్య పోతుంది.

5. టమాటా, యాపిల్ పండ్ల రసాలను కలిపి రోజూ సేవించినా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

6. నిత్యం ఆహారంలో ఏదో ఒక విధంగా తేనెను తీసుకోవాలి. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తాన్ని తయారు చేస్తుంది.

7. చేపలు, ఇతర సీ ఫుడ్స్, లివర్, గుడ్డులోని పచ్చని పదార్థం, పచ్చి బఠానీలు, బ్రొకోలి, కిస్మిస్, ఖర్జూరం తదితర పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

3438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles