రోజూ పరగడుపునే సోంపు నీళ్లు తాగితే..?


Tue,November 14, 2017 05:01 PM

మనలో చాలా మంది సోంపును భోజనం తిన్న తరువాత వేసుకుంటారు. దీని వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని వారి నమ్మకం. అయితే ఈ విషయం నిజమే. అయినప్పటికీ సోంపు గింజల వల్ల ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనకు కలుగుతాయి. అయితే అందుకు సోంపు గింజలను కాదు, సోంపు నీటిని తాగాలి. దాన్ని ఎలా తయారు చేయాలంటే...

ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో గుప్పెడు సోంపు గింజలను వేయాలి. అనంతరం ఆ నీటిని మరగబెట్టాలి. నీరు బాగా మరిగాక చల్లార్చి ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ సోంపు నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సోంపు గింజలను తింటే జీర్ణశక్తి ఎలా పెరుగుతుందో సోంపు నీటిని తాగినా అదే ఫలితం మనకు కలుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా పోతాయి.

2. రక్తహీనత ఉన్నవారు సోంపు నీటిని తాగితే మంచిది. రక్తం బాగా తయారవుతుంది.

3. బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

4. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

5. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.

6. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

7. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు సోంపు నీటిలో ఉన్నాయి.

6702

More News

VIRAL NEWS

Featured Articles