దాల్చిన చెక్క పొడిని పాల‌లో క‌లిపి తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే తెలుసా..!


Sun,November 12, 2017 01:24 PM

దాల్చిన చెక్క‌ను త‌ర‌చూ మ‌నం వంట‌కాల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇక పాల‌ను చాలా మంది నిత్యం తాగుతూనే ఉంటారు. దీంతో మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్లు ల‌భిస్తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క, పాలను క‌లిపి తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం మాత్ర‌మే కాదు, ఈ మ‌ధ్య కాలంలో ప‌రిశోధ‌న‌లు చేసిన సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఒక కప్పు వేడి పాలలో రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే చాలు, దీంతో కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి.

1. దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జీర్ణాశ‌యం, పేగులు శుభ్ర‌మ‌వుతాయి. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం ఉండ‌వు.

2. టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు నిత్యం దాల్చిన చెక్క పాల‌ను తాగాలి. దీంతో వారి ర‌క్తంలో గ్లూకోజ్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. ఫ‌లితంగా మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

3. దాల్చిన చెక్క పాల‌ను రాత్రి పూట తాగితే చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి దూర‌మ‌వుతాయి. ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాల‌నుకునే వారికి ఈ పాలు చ‌క్క‌ని ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు.

4. దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు క‌లుగుతాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చ‌ర్మం శుభ్ర‌మ‌వుతుంది. అందులో ఉండే క్రిములు చ‌నిపోతాయి. ఫ‌లితంగా చ‌ర్మం నిగారింపును, మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది. అంతేగాక శిరోజాలు కూడా దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి.

5. దాల్చిన చెక్క క‌లిపిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల కీళ్లు, ఎముక‌ల నొప్పులు త‌గ్గుతాయి. వృద్ధుల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

6. దంత స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాస‌న స‌మ‌స్య ఉండ‌దు.

7. ఈ కాలంలో ఎక్కువ‌గా ఇబ్బందుల‌కు గురి చేసే జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

6902

More News

VIRAL NEWS