ఈ లాభాలు తెలిస్తే కొత్తిమీర‌ను వ‌దిలిపెట్ట‌రు తెలుసా..!


Sun,January 7, 2018 04:28 PM

కొత్తిమీర‌ను నిత్యం మ‌నం ప‌లు వంట‌ల్లో వేస్తూనే ఉంటాం. కొంద‌రు దీంతో ప‌చ్చ‌డి చేసుకుంటారు. ఇక చారు వంటి ఆహారాల్లో అయితే కొత్తిమీర లేకుండా ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర వ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. అయితే కొత్తిమీర కేవలం రుచికి, సువాసన కోసమే అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే వాటితోపాటు కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. కొత్తిమీరలో ఉండే డొడిసెనోల్ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది.

2. ఒక గ్లాస్‌లో నీరు, మజ్జిగను సమభాగాల్లో కలిపి అందులో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం లేదా రాత్రి తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్లన్నీ లభిస్తాయి. విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్ వంటివి పుషల్కంగా అందుతాయి. శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు ఇది తోడ్పడుతుంది.

3. అజీర్ణం బాధిస్తుంటే కొత్తిమీర రసంలో జీలకర్ర, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. గర్భిణీలు రోజూ 2,3 చెంచాల కొత్తిమీర రసాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్దకం వంటివి తగ్గిపోతాయి.

4. పేగుపూత, కడుపులో మంట ఉన్నవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.

5. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి వండి తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

6. కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. క‌నుక వాటి నుంచి వ‌చ్చే ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్వర తీవ్రత తగ్గుతాయి. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.

8976

More News

VIRAL NEWS