ఆక‌లి పెర‌గాలంటే.. వీటిని తినాలి..!


Sat,January 6, 2018 04:31 PM

తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోయినా, అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, ప‌లు మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా చాలా మందికి ఆక‌లి స‌రిగ్గా వేయ‌దు. దీంతో రోజూ ఆహారాన్ని స‌రిగ్గా తిన‌లేక‌పోతారు. ఫ‌లితంగా అది పోష‌కాహార లోపానికి దారి తీస్తుంది. ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది. అయితే కింద చెప్పిన ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకుంటే దాంతో ఆక‌లి బాగా పెరుగుతుంది. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అల్లం


వికారం, అజీర్తి వంటివి ఇబ్బంది పెడుతుంటే అల్లం అందుకు చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ప్రతి రోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి పెరుగుతుంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కొద్దిగా అల్లంర‌సం సేవించినా చాలు ఆక‌లి బాగా వేస్తుంది.

2. నిమ్మరసం


జీర్ణక్రియకు ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. గ్లాసు నీటిలో కొంత నిమ్మరసం కలిపి, దానికి కొద్దిగా తేనె, ఉప్పు కలిపి ఆ నీటిని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

3. ఖర్జూరాలు


ఖర్జూరాలను రసంలా చేసి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. కనీసం ప్రతి రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఆకలి సమస్య తీరిపోతుంది. స్వీట్లలోనూ వీటిని ఉపయోగించవచ్చు.

4. దాల్చిన చెక్క


దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని తరచూ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

5. ద్రాక్ష


వీటిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత వీటిని తీసుకుంటే అరుగుదల బాగా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది.

6. మెంతులు


వీటిని తీసుకుంటే పొట్టలోని గ్యాస్ అంతా క్షణాల్లోనే బయటకు వస్తుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం కొద్దిగా మెంతిపొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది. పెరుగులో కూడా కలిపి తినవచ్చు. ఆకలి పెరుగుతుంది.

9190

More News

VIRAL NEWS