రోజూ పరగడుపునే ఐదారు తులసి ఆకులను తింటే ఏమవుతుందో తెలుసా..?


Sat,April 14, 2018 05:26 PM

ఆయుర్వేదం మనకు అందించిన అద్భుతమైన ఔషధ మొక్కల్లో తులసి కూడా ఒకటి. ఈ మొక్క ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వాటితో మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఐదారు తులసి ఆకులను అలాగే నమిలి తింటే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తులసి ఆకులను రోజూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తలనొప్పి, నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. కీళ్ల నొప్పులు ఉండవు.

3. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

4. తులసి ఆకులను తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. చర్మం లోలోపల శుభ్రమై కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.

5. డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిలను నయం చేసే గుణాలు తులసిలో ఉన్నాయి. మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

6. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. లివర్ శుభ్రమవుతుంది. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది.

7239

More News

VIRAL NEWS

Featured Articles