దాల్చిన చెక్క‌తో ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు తెలుసా..!


Mon,May 14, 2018 04:56 PM

దాల్చిన చెక్క చ‌క్క‌ని సువాస‌న‌ను ఇచ్చే మ‌సాలా దినుసుల జాబితాకు చెందిన‌ది. అందుకే దీన్ని వంటల్లో మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. దీని వల్ల వంట‌కాల‌కు మంచి రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే దాల్చిన చెక్క ఇలా కేవ‌లం వంట‌కాల‌కే కాదు మ‌న ఆరోగ్యం కోసం కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును త‌గ్గిస్తుంది. అందుకు దాల్చిన చెక్క‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దాల్చిన చెక్క‌ను లేదా దాని పొడిని కొంత తీసుకుని ఒక పాత్ర నీటిలో వేసి మ‌రిగించాలి. ఆ త‌రువాత వ‌చ్చే నీటిని తాగి 30 నిమిషాలు ఆగాక భోజ‌నం చేయాలి. ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం చేస్తే కొద్ది రోజుల్లోనే బ‌రువు త‌గ్గ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

2. భోజ‌నం చేసేట‌ప్పుడు ఆహార ప‌దార్థాల‌పై చిటికెడు దాల్చిన చెక్క పొడిని చ‌ల్లుకుని తినాలి. ఇలా రోజుకు 3 పూట‌లా తింటుంటే ఫ‌లితం క‌నిపిస్తుంది. త్వ‌ర‌లోనే బ‌రువు త‌గ్గుతారు.

3. ఆహారంలో తిన‌డం ఇష్టం లేక‌పోతే స్వ‌చ్ఛ‌మైన ప‌ళ్ల ర‌సంలోనూ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని రోజూ ఉద‌యం, సాయంత్రం తాగ‌వ‌చ్చు. అయితే ఆ ప‌ళ్ల ర‌సంలో చ‌క్కెర క‌ల‌పకుండా తాగాలి.

4. రెండు క‌ప్పుల నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఆ నీటిని బాగా మ‌రిగించాలి. నీరు వేడిగా ఉన్న‌ప్పుడే అందులో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి తాగాలి. ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు.

5. పాల‌ను బాగా మ‌రిగించి అందులో దాల్చిన చెక్క పొడిని క‌లుపుకుని రోజూ రెండు పూట‌లా తాగుతున్నా అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. రోజూ రెండు పూట‌లా ఓట్స్‌ను ఉడ‌క‌బెట్టి అందులో దాల్చిన చెక్క పొడిని కలిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గుతారు.

4505

More News

VIRAL NEWS