మ‌ట్టి కుండ‌లో నీళ్ల‌ను తాగితే క‌లిగే లాభాలివే..!


Sun,May 13, 2018 08:02 PM

ఇప్పుడంటే ఎక్కడ చూసినా జనాలు ఫ్రిజ్‌లలో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు, సహజ సిద్ధంగా తయారు చేసిన మట్టి కుండల్లో పోసిన నీటిని తాగేవారు. అందుకే ఆ కాలంలో వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అయితే అసలు మట్టికుండలో పోసిన నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మట్టికుండలో నీటిని పోస్తే దానికి ఉండే లక్షణాల కారణంగా ఆ నీటిలో ఉండే మలినాలను కుండ పీల్చుకుంటుందట. దీన్ని సైంటిస్టులు రుజువు చేశారు కూడా. అందుకని మట్టికుండలో పోసిన నీరు ఫిల్టర్ నీరు అంత స్వచ్ఛంగా మారుతుంది. కనుక ఆ నీటిని తాగడం చాలా మంచిదని వారు అంటున్నారు.

2. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల ఆ కుండలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ నీటిలో కలుస్తాయి. కనుక ఆ నీటిని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

3. ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల ఎవరి శరీరమైన సహజంగానే ఆమ్లత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మట్టి కుండలో పోసిన నీటిని తాగితే అప్పుడు ఆ ఆమ్లత్వ ప్రభావం తగ్గుతుంది. శరీరం ఆల్కలైన్ స్థితికి చేరుకుని ఆరోగ్యంగా ఉంటారు.

4. మట్టి కుండలో పోసిన నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది.

5. వడదెబ్బ తగిలిన వారికి మట్టికుండలో ఉంచిన నీటిని ఇస్తే వారు త్వరగా కోలుకుంటారు. అలాగే సాధారణ వ్యక్తులు కూడా మట్టికుండలో ఉంచిన నీటితో ముఖం కడుక్కుంటే శరీరానికి ఆహ్లాదం లభిస్తుంది.

6. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మట్టికుండలో ఉంచిన నీరే బెటర్. ఆ నీటిని తాగితే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు పోతాయి.

9885

More News

VIRAL NEWS