హైబీపీ త‌గ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!


Mon,May 14, 2018 03:06 PM

ఉప్పు, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తినడం, పచ్చళ్లు అధికంగా తినడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళనలతో కూడిన బిజీ లైఫ్, సరైన పౌష్టికాహారం టైముకు తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం... ఇలా చెప్పుకుంటూ పోతే బీపీ పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. అయితే దీన్ని తగ్గించుకోవాలంటే కంగారు పడి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే బీపీని కంట్రోల్ చేయవచ్చు. ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బీపీని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇది డైయూరిటిక్ కూడా. దీంతో కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె సమస్యలు రావు. నిత్యం వెల్లుల్లిని ఆహారం భాగం చేసుకుంటే తద్వారా బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.

2. టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్త నాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.

3. బీట్‌రూట్, ముల్లంగిలను తరచూ ఆహారంలో భాగంగా తింటుంటే బీపీ సమస్య నుంచి ఇట్టే బయట పడవచ్చు. వీటిలో రక్త సరఫరా మెరుగు పరిచే గుణాలు కూడా ఉన్నాయి.

4. బీపీ తగ్గాలంటే శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అందుకని నిత్యం తప్పకుండా 8 నుంచి 10 గ్లాసుల నీరు కచ్చితంగా తాగాల్సిందే. దీంతో బీపీని కొంత వరకు అదుపు చేయవచ్చు.

5. అరటి పండ్లను తరచూ తింటుంటే బీపీ సమస్య బాధించదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీ ఇట్టే తగ్గిపోతుంది. అంతేకాదు, ఇది గుండెకు కూడా చాలా మంచిదే. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

6. డార్క్ చాక్లెట్‌లో పాలీ ఫినాల్స్, ఫ్లెవనాయిడ్స్, క్యాథెచిన్స్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బీపీని గణనీయంగా తగ్గించి వేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.

4528

More News

VIRAL NEWS