యాప్రికాట్స్‌ను తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!


Sun,September 9, 2018 05:01 PM

మార్కెట్‌లో మనకు యాప్రికాట్స్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. యాప్రికాట్స్‌లో ఉండే పోషకాలు మన శరీరానికి సంపూర్ణ పోషణను ఇస్తాయి. అనారోగ్యాలు రాకుండా చూస్తాయి. యాప్రికాట్స్‌ను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాప్రికాట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను నయం చేస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

2. యాప్రికాట్స్‌లో ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. జీర్ణాశయం లోపలి భాగానికి సంరక్షణను ఇస్తుంది. పేగులకు బలం చేకూరుస్తుంది.

3. యాప్రికాట్స్‌లో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందువల్ల యాప్రికాట్లు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

5. యాప్రికాట్స్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల రక్తం ఎక్కువగా తయారవుతుంది. వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లను తినిపిస్తే వారు త్వరగా కోలుకుంటారు. అలాగే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

6. యాప్రికాట్స్‌లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది.

5876

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles