రోజూ జొన్న ఆహారం తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలివే..!


Thu,December 7, 2017 08:48 AM

ఇప్పుడంటే చాలా మంది తినడం లేదు కానీ.. ఒకప్పుడు మన పూర్వీకులు జొన్న ఆహారం ఎక్కువగా తినేవారు. జొన్న రొట్టెలు, గటక చేసుకుని లాగించేవారు. అందువల్ల వారు చాలా దృఢంగా ఉండేవారు. అయితే మనం కూడా జొన్నలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. రోజూ జొన్న ఆహారం తింటే మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. జొన్నల్లో ఉండే ప్రోటీన్లు, ఐరన్, కాపర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే జొన్న ఆహారం రోజూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జొన్నల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియను క్రమబద్దీకరిస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను పోగొడుతుంది. మలబద్దకం ఉండదు. అధిక బరువును తగ్గిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతోపాటు హై బీపీ, స్ట్రోక్స్ రాకుండా కూడా చూస్తుంది.

2. జొన్న ఆహారం తక్కువగా తిన్నా చాలు, దాంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనికి తోడు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కనుక బరువు తగ్గాలనుకునే వారు జొన్న ఆహారాన్ని రోజూ తింటే ఫలితం ఉంటుంది.

3. ఒక కప్పు జొన్నల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మాంసాహారంలో లభించే ప్రోటీన్ కన్నా ఎక్కువే. కనుక మాంసాహారం తినలేని వారు జొన్నలను తింటే తద్వారా క్వాలిటీ ఉన్న ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతాయి. వ్యాయమం చేసే వారు జొన్న ఆహారం రోజూ తింటే శారీరక దృఢత్వం కలుగుతుంది. దీంతోపాటు వారు కావాలనుకున్న దేహాకృతి సొంతమవుతుంది.

4. జొన్నల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, కాపర్, జింక్, పాస్ఫరస్, పొటాషియం, బి విటమిన్లు జొన్నల ద్వారా మనకు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి.

5. మధుమేహం ఉన్నవారికి జొన్నలు బాగా మేలు చేస్తాయి. జొన్న ఆహారం తింటే జీర్ణం నెమ్మదిగా అవుతుంది. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారు రాత్రి పూట జొన్న రొట్టె తింటే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

8179

More News

VIRAL NEWS