మొల‌కెత్తిన పెస‌ల‌ను రోజూ తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Sun,March 11, 2018 03:14 PM

పెస‌ర‌పప్పును నిజానికి చాలా మంది అంత ఇష్టంగా తిన‌రు కానీ వీటిలో అద్భుత‌మైన పోష‌కాలు దాగి ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవ‌న్నీ మన శ‌రీరానికి ఎంత‌గానో అవ‌స‌రం. ఇక వీటిని మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో రోజూ తింటే దాంతో మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు దూర‌మ‌వుతాయి. రోజూ వీటిని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొల‌కెత్తిన పెస‌ల‌లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. అలాగే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది.

2. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే క‌డుపు త్వ‌ర‌గా నిండుతుంది. దీనికితోడు అంత‌ త్వ‌ర‌గా ఆక‌లి కూడా వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. దీంతోపాటు నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉంటాయి.

3. విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్ యాసిడ్‌, నియాసిన్‌, విట‌మిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటి పోషకాలు మొల‌కెత్తిన పెస‌లలో స‌మృద్ధిగా ల‌భిస్తాయి. కాబ‌ట్టి వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెప్ప‌వ‌చ్చు. దీంతో శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ క‌లుగుతుంది.

4. మొల‌కెత్తిన పెస‌ల‌ను తీసుకోవడం వ‌ల్ల దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. చూపు మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

5. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. రక్తం బాగా త‌యార‌వుతుది. ర‌క్త‌హీన‌త తొల‌గిపోతుంది. శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.

5815

More News

VIRAL NEWS

Featured Articles