అనారోగ్య సమస్యలపై అద్భుతంగా పనిచేసే పసుపు, మిరియాలు..!


Sun,June 10, 2018 07:40 PM

భారతీయుల వంట ఇంటి పదార్థాల్లో పసుపు చాలా ముఖ్యమైంది. దీన్ని మనం అనేక వంటకాల్లో వేస్తుంటాం. పసుపు వల్ల ఆయా వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. దీంతోపాటు పసుపు వల్ల పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మనం వంటల్లో వేసే మిరియాల్లోనూ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పసుపు, మిరియాలను కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. వీటిని పాలలో కలిపి తాగవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటిలో కలిపి సేవించవచ్చు. ఎలా తీసుకున్నా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. పసుపు, మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఆయా భాగాల్లో ఉండే వాపులు కూడా తగ్గుతాయి. ఈ రెండింటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి.

3. పసుపు, మిరియాల కాంబినేషన్ డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

4. బరువు తగ్గాలనుకునే వారికి పసుపు, మిరియాలు చక్కని కాంబినేషన్‌గా పనికొస్తాయి. గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు, మిరియాల పొడిని సమపాళ్లలో కలిపి ఉదయాన్నే తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.

5. పసుపు, మిరియాలను రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

6227

More News

VIRAL NEWS