కడుపునొప్పిని తగ్గించే పవర్‌ఫుల్ టిప్స్


Tue,December 5, 2017 05:33 PM

ఫుడ్‌ పాయిజనింగ్, గ్యాస్, అసిడిటీ, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు.. ఇలా అనేక కారణాల వల్ల తరచూ కొందరికి కడుపు నొప్పి వస్తుంటుంది. దీంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ క్రమంలో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే వైద్యులు సూచించే మందులతోపాటు కింద ఇచ్చిన పలు టిప్స్ పాటిస్తే ఎలాంటి కడుపు నొప్పిని అయినా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బ్రెడ్ టోస్ట్


కడుపు నొప్పికి బాగా టోస్ట్ చేసిన బ్రెడ్ మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. బాగా కాల్చిన బ్రెడ్‌లో ఉండే చార్ జీర్ణాశయంలో ఉండే విష పదార్థాలను పీల్చుకుంటుంది. దీంతో నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కనుక టోస్టర్‌లో బ్రెడ్‌ను బాగా కాల్చి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది.

2. యాపిల్ సైడర్ వెనిగర్


కడుపు నొప్పిని తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ అమోఘంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. దీంతో జీర్ణాశయంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఫలితంగా కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. పెరుగు


పెరుగులో ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మంచి బాక్టీరియా కావడంతో జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియాను అంతం చేస్తాయి. ఫలితంగా కడుపు నొప్పి తగ్గుతుంది. పెరుగును అలాగే తింటే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.

4. పుదీనా టీ


ఒక పాత్రలో నీటిని పోసి అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడగట్టి గోరు వెచ్చగా ఉండగా తాగేయాలి. దీంతో కడుపులో ఉండే ఇబ్బంది పోతుంది. లేదంటే పుదీనా ఆకులను నేరుగా తిన్నా చాలు, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. వాము


గుప్పెడు వాములో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అలాగే తినేయాలి. అనంతరం గోరు వెచ్చని నీటిని తాగాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది.

6893

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles