దంతాల నొప్పిని త‌గ్గించే అద్భుతమైన చిట్కాలు..!


Sun,April 15, 2018 05:47 PM

దంతాల నొప్పి వచ్చిందంటే చాలు ఏదీ తిన‌లేం, తాగ‌లేం. అలాంటి స‌మ‌యంలో కేవ‌లం దంతాల‌ను క‌దిలించినా చాలు, విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. అయితే దీనికి చింతించాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధమైన ప‌దార్థాల‌తోనే దంతాల నొప్పి స‌మ‌స్య‌ను ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉల్లిపాయ‌ల‌ను మ‌నం వంట‌ల్లో రుచి కోసం నిత్యం ఉప‌యోగిస్తుంటాం. అయితే వీటితో దంతాల నొప్పిని కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే, ఒక ఉల్లిగ‌డ్డ‌ను తీసుకుని అడ్డంగా చ‌క్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చ‌క్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ఉల్లిలోని ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.

2. రెండు, మూడు చుక్క‌ల ల‌వంగ నూనె, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. అందులో కాట‌న్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాల‌పై రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర దంత‌ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

3. పైన చెప్పిన ఉల్లిపాయ‌ల్లాగే కీర‌దోస ముక్క‌ల‌ను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాల‌పై ఉంచాలి. దీంతో దంతాల‌ నొప్పి త‌గ్గుతుంది.

4. వేడి వేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్‌ను నొప్పి పుడుతున్న దంతాల‌పై ఉంచాలి. అందులో ఉండే ప‌లు ర‌సాయ‌నాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి. చిగుళ్లను హాయి ప‌రుస్తాయి.

5. అల్లం కొమ్మును తీసుకుని బాగా క‌డిగి దాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఆ ముక్క‌ల‌ను నొప్పి ఉన్న దంతాల‌తో న‌మ‌లాలి. అలా చేయడం వ‌ల్ల అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.

7880

More News

VIRAL NEWS

Featured Articles