కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు..!


Mon,August 6, 2018 06:19 PM

సాధారణంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒంట్లో నీరు అలాగే ఉండిపోయి శరీరం ఉబ్బిపోతుంది. పొట్ట బాగా ఉబ్బి ఉండడం, మోకాళ్లలో వాపు ఉండడం, జ్వరం రావడం వంటి లక్షణాలుంటాయి. అలాంటి సమస్య కాకుండా ఇతర సాధారణ కారణాలతో కడుపు ఉబ్బరం వచ్చిన వారికి ఈ కింద తెలిపిన చిట్కాలు వాడితే ప్రయోజనం ఉంటుంది. దీంతో సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి కడుపు ఉబ్బరానికి పనికొచ్చే ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. జీలకర్రను నీళ్లలో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని ప్రతి రోజూ మూడు పూటలా పూటకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే ఫలితం ఉంటుంది.

2. మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూన్ చొప్పున నీటితో మింగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

3. పిప్పళ్లు తీసుకుని బాగా దంచి చూర్ణం చేయాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని, దీనికి ఒక టీస్పూన్ తేనెను కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు మూడు పూటలా సేవిస్తే ఫలితం ఉంటుంది.

4. ఇంగువను శనగ గింజంత మోతాదులో రోజుకు మూడు పూటలా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

5. ప్రతి ఆరు గంటలకు ఒకసారి నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని అలాగే నమిలి మింగాలి. లేదా పచ్చి కాకరకాయ రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు.

7209

More News

VIRAL NEWS