రోజూ గుప్పెడు వేరుశెనగలతో బెల్లం కలిపి తింటే..?


Sun,December 3, 2017 01:25 PM

వేరుశెనగ పప్పును నిత్యం మనం అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటితో చేసే పచ్చడి అమోఘంగా ఉంటుంది. పల్లీల చట్నీని మనం వివిధ రకాల టిఫిన్స్‌లో తింటాం. అలాగే వీటిని పొడి చేసి కూరల్లో కూడా వేస్తారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే రుచికే కాదు, వేరుశెనగలు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు వీటిల్లో ఉంటాయి. అలాగే బెల్లంలో కూడా అనేక విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ గుప్పెడు వేరుశెనగలతో కొద్దిగా బెల్లం కలిపి తింటే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుప్పెడు వేరు శెనగ పప్పు, బెల్లంను కలిపి రోజూ తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తం ఎక్కువగా తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇది మేలు చేసే అంశం. దీంతోపాటు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. గుండె సమస్యలు రావు.

2. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే మంచిది.

3. నేటి తరుణంలో కాలుష్యం ఎంతగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే రోజూ గుప్పెడు వేరుశెనగలు, కొద్దిగా బెల్లం కలిపి తింటే కాలుష్యం బారి నుంచి తప్పించుకోవచ్చు. దాని వల్ల కలిగే వ్యాధుల నుంచి మనకు రక్షణ లభిస్తుంది.

4. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. చలికాలంలో ఈ ఆహారాన్ని కచ్చితంగా తినాలి.

5. ఎదిగే పిల్లలకు ఈ ఆహారాన్ని పెడితే మంచిది. వారికి కావల్సిన బలం అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

10656

More News

VIRAL NEWS